
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే వేతనాల్లో కోత నుంచి పోలీస్ శాఖ, వైద్యారోగ్య శాఖ, పారిశుద్య కార్మికులకు మినహాయింపునివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో పై ౩ శాఖల ఉద్యోగులకు పూర్తి వేతనాలు అందనున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సోమవారం ప్రగతిభవన్లో సమీక్షించిన సీఎం కేసీఆర్..కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా వివిధ రకాల చెల్లింపులపై నిర్ణయం తీసుకున్నసంగతి తెలిసిందే.