
ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇవ్వాళ ఒక్కరోజే కొత్తగా 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 40కి చేరింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాత్రి 9నుంచి ఇప్పటివరకు 17కొత్త కేసులు నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో 11, గుంటూరు జిల్లా 9, విశాఖ జిల్లా 6, కృష్ణా జిల్లా 5, తూ,గో జిల్లా 4, అనంతపురం 2, చిత్తూరు, కర్నూలు, నెల్లూరులో ఒక్కో పాజిటివ్ కేసు నమోదయ్యాయి. అయితే కరోనా పాజిటివ్ కేసుల్లో ఢిల్లీలోమతపర ప్రార్థనలకు వెళ్లివచ్చినవారే అధికంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రం నుంచి మతప్రార్ధనలకు 711 మంది వెళ్లారన్నారు . వారిని గుర్తించేపనిలో ఉన్నామని అధికారులు తెలిపారు. ఇప్పటికే కొందరిని క్వారంటైన్ ఉంచామన్నారు.