
2020-21 విద్యా సంవత్సరానికి మైనార్టీ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో అడ్మిషన్ల కోసం, 6, 7, 8 తరగతుల్లో ఖాళీ సీట్లల్లో భర్తీ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 12న ఇంటర్, 5వ తరగతికి ఏప్రిల్ 18న, 6,7,8వ తరగతులకు ఏప్రిల్ 20న నిర్వహించాల్సిన ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు జిల్లా మైనార్టీశాఖ అధికారి ఎల్.శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని, పూర్తి వివరాలకు గురుకుల మైనార్టీ పాఠశాలల ప్రిన్సిపాళ్లు సూర్యాపేట బాలురు- 73311 70857, తుంగతుర్తి బాలురు 984840 3180, హుజూర్‌నగర్ బాలికలు-7995057973, కోదాడ బాలికలు 7331170856లను సంప్రదించాలని సూచించారు.