
దేశంలో గడచిన 24 గంటల్లో 388 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 132 మంది కరోనాతో కోలుకున్నారని నేటి వరకు 47,951 మందికి కరోనా టెస్టులు చేశామని తెలిపింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారులు మీడియాకు పలు వివరాలు వెల్లడించారు.
‘దేశవ్యాప్తంగా 51 ప్రైవేట్ ల్యాబ్స్‌లో కరోనా టెస్టులకు అనుమతినిచ్చాం. ఇప్పటి వరకు 38 మంది మృతి చెందారు. మర్కజ్‌కు వెళ్లిన 1800 మందిని క్వారంటైన్‌కు తరలించాం. కరోనా నియంత్రణకు అన్ని రాష్ట్రాలు సహకరిస్తున్నాయి. ఎవరూ ఆందోళన చెందొద్దు.. పరిస్థితి అదుపులోనే ఉంది. ప్రభుత్వ సూచనలు, ఆదేశాలను ప్రజలంతా తప్పకుండా పాటించాలి. 5వేల రైల్వే కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చాం. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నవారే ఎక్కువ పాజిటివ్‌లుగా నిర్ధారణ అయింది. వలసకూలీల కోసం 21,486 శిబిరాలు ఏర్పాటు చేశాం. 6.75లక్షల మంది వలసకూలీలకు ఆశ్రయం కల్పించామని’ పేర్కొంది.