గవర్నర్‌ తమిళిసైతో సీఎం కేసీఆర్‌ భేటీ

రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్‌భవన్‌లో ఈ సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, హెల్త్‌ చీఫ్‌ సెక్రటరీ శాంతికుమారి, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసుల స్థితిగతులను, కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను, లాక్‌డౌన్‌ అమలు, పేదలకు రేషన్‌ బియ్యం పంపిణీ, నగదు పంపిణీ, ఇతర పరిస్థితులను గవర్నర్‌కు వివరించారు.