
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 132 కు చేరుకుంది. నిన్న రాత్రి 10 గంటల నుంచి ఈరోజు ఉదయం వరకు ల్యాబ్ ఫలితాల్లో కొత్తగా 21 కేసులు పాజిటివ్‌గా వచ్చాయి. జిల్లాలవారిగా పాజిటివ్ కేసుల సంఖ్య ఈ విధంగా ఉంది. అనంతపురంలో 2, చిత్తూరు-8, తూర్పుగోదావరి-9, గుంటూరు-20, కడప-15, కృష్ణా-15, కర్నూలు-1, నెల్లూరు-20, ప్రకాశం-17, విశాఖపట్నం-11, పశ్చిమగోదావరి-14.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ… జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించిన వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైద్య సహాయం తీసుకోవాల్సిందిగా సూచించారు. ఇది ప్రాణాంతక వ్యాధేమి కాదని.. చికిత్స తీసుకుంటే తగ్గిపోతుందన్నారు. వైరస్ సోకిన వారిలో మరణాల శాతం 3 కంటే తక్కువే ఉందన్నారు. ఈ సమయంలో వృద్ధులు, ఇతర జబ్బులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.