
అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టెనెంట్ గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారగణంతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రేపు వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడితో కలిసి రాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు. కోవిడ్-19 వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ర్టాల చర్యలపై రాష్ట్రపతి ఈ సమావేశం ద్వారా సమీక్షంచనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ అన్ని రాష్ర్టాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. దేశంలో కోవిడ్-19 పరిస్థితిపై ప్రధాని సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ పాల్గొన్నారు.