
దేశంలో కోవిడ్19 పాజిటివ్ కేసుల సంఖ్య 2183కు చేరినట్లు ఐసీఎంఆర్ పేర్కొన్నది. భువనేశ్వర్‌లో పాజిటివ్ తేలిన తొలి వ్యక్తి కోలుకున్నట్లు తెలుస్తోంది. అతనికి నిర్వహించిన మలి పరీక్షలో అతను నెగటివ్‌గా తేలినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు ఒడిశాలో ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. రాజస్థాన్‌లోని బిల్వారాలో కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 17కు చేరుకున్నది. ఆ రాష్ట్రంలో మొత్తం 154 కేసులు నమోదు అయ్యాయి. గోవాలో కోవిడ్19 పాజిటివ్ కేసుల సంఖ్య ఆరుకు చేరుకున్నది.