
నల్లగొండ జిల్లాలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు విలేకరులకు తెలిపారు. వీరిలో ఇద్దరు బర్మాదేశీయులు కాగా, దామరచర్ల మండలకేంద్రానికి చెందిన మహిళ ఉన్నారు. 15మంది బర్మా దేశస్తులు, మరో ఇద్దరు కశ్మీర్ యువకులు మతప్రచారం కోసం మార్చి 15న హైదరాబాద్ నుంచి నల్లగొండకు చేరుకున్నారు. ప్రార్థనా మందిరాల్లో విడిది చేశారని విశ్వసనీయ సమాచారంతో పోలీసులు, వైద్యాధికారులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. ఫీవర్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా బర్మా దేశస్తుల్లో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు జిల్లా యంత్రాంగం శుక్రవారం ప్రకటించింది. ఇక దామరచర్ల మండల కేంద్రానికి చెందిన దంపతులు ఢిల్లీలో ప్రార్థనల్లో పాల్గొని ఇంటికి చేరుకున్నారు. అధికారులు క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు జరిపించగా మహిళకు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో కుటుంబ సభ్యులతో పాటు ఇంట్లో అద్దెకు ఉంటున్న 12మందిని సైతం క్వారంటైన్ నిమిత్తం నల్లగొండకు తరలించారు. ఢిల్లీకి వెళ్లిన 52మందిలో ఇప్పటి వరకు 46మంది రిపోర్టులు వెల్లడయ్యాయి. మరో ఏడుగురి రిపోర్టులు పెండింగ్‌లో ఉన్నాయి.