
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలోని 22 జిల్లాలకు విస్తరించినట్టు సమాచారం. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 72 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసులు 229కి చేరాయి. కరోనాతో 11మంది చనిపోయారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారి నుంచి 32మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో 186మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. మర్కజ్ వెళ్లి వచ్చినవారిలో 435 మందికి అధికారులు స్వీయ నిర్భందం విధించారు. మర్కజ్ వెళ్లివచ్చి ప్రభుత్వ క్వారంటైన్ లో 365 మంది ఉన్నారు. రాష్ట్రంలో 19,368 స్వీయ నిర్భధం పూర్తి చేసుకున్నారని అధికారులు వెల్లడించారు.
మర్కజ్ ప్రార్థనలకు వెళ్లివచ్చిన 1030 మందిలో 925 మందిని గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఇంకా 105మందిని గుర్తించాల్సిఉంది. మర్కజ్ వెళ్లి వచ్చివారిలో 161మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. శుక్రవారం 400మంది అనుమానితులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ఇప్పటివరకు 59 వేల140 మంది మృతిచెందగా.. 2.28లక్షల మంది కోలుకున్నారు.