
కరోనా వైరస్ ప్రపంచదేశాలపై అంతకంతకూ తన ప్రభావాన్ని చూపుతుంది. వేగంగా విస్తరిస్తూ వేలాది మంది ప్రాణాలను బలిగొంటుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 11లక్షలకు చేరింది. అత్యధికంగా అమెరికాలో 2.77లక్షల కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లోనే సుమారు 15వందల మంది చనిపోయారంటే దీని తీవ్రత ఎంత స్ధాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే దీని బారినపడి మరణించిన వారి సంఖ్య 60వేలకు చేరుకుంది. ఒక్క ఇటలీలోనే కరోనా వల్ల 14, 681 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్‌లో 12వేలు, అమెరికాలో 7వేలకు పైగా మరణాలు సంభవించాయి. ఇక ఇండియాలో పాజిటివ్ కేసుల సంఖ్య 3వేలకు చేరగా 68 మంది మృతిచెందారు.