
ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్ర పాటించాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావొద్దని, లాక్ డౌన్ కు అందరు సహకరించాలని కోరారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశామన్నారు. ఇప్పటి వరకు 3 వేల వాహనాలు సీజ్ చేసినట్టు ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ ను అందరూ ఏకతాటిపై నిలబడి పోలీసులకు సహకరిస్తున్నారని సీపీ చెప్పారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన సూచించారు. ఇదే అత్యంత కీలక సమయమని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వచ్చే రెండు వారాలు కూడా ప్రజలు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.