
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వయసుతో నిమిత్తం లేకుండా ప్రజలు ఈ వైరస్ బారిన పడుతున్నారు. కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే కొత్తగా 10 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 190కి చేరుకుంది. కృష్ణా జిల్లాలో-5, గుంటూరులో-3, ప్రకాశం, అనంతపురంలో ఒక్కొక్క కేసు నమోదైంది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 32కు చేరగా..కృష్ణా-27, కడప-23, ప్రకాశం-24, గుంటూరు-16, విశాఖ-15, పశ్చిమ గోదావరి-15, తూర్పుగోదావరి-11, చిత్తూరు-10, కర్నూలు-4, అనంతపురం-3 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.