
రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు చేపట్టిన చర్యలు, లాక్డౌన్ పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పౌరసరఫరాలశాఖ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్డౌన్ అమలు, రేషన్ పంపిణీ, ఇతర అంశాలపై సీఎం చర్చిస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. వైద్యారోగ్య శాఖ మంత్రి, అధికారులతో సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి, పరిస్థితులను తెలుసుకుంటున్నారు.