భారత్‌లో 114కు చేరిన కరోనా మరణాల సంఖ్య

భారత్‌లో కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశ నలుమూలలకు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందింది. ఇవాళ ఉదయం కరోనా మరణాల సంఖ్య 114కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 5 మంది మృతి చెందగా, 354 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలిపింది. మొత్తంగా ఇండియా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,421కి చేరింది. 325 మంది ఈ వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 

అత్యధికంగా మహారాష్ట్రలో 868, తమిళనాడులో 621, ఢిల్లీలో 525, తెలంగాణలో 364, కేరళలో 327, ఉత్తరప్రదేశ్‌లో 305, ఆంధ్రప్రదేశ్‌లో 303, రాజస్థాన్‌లో 301, మధ్యప్రదేశ్‌లో 256, కర్ణాటకలో 163, గుజరాత్‌లో 146, హర్యానాలో 110, జమ్మూకశ్మీర్‌లో 109, పశ్చిమ బెంగాల్‌లో 80, పంజాబ్‌లో 79, ఒడిశాలో 40, బీహార్‌లో 32, ఉత్తరాఖండ్‌లో 31, అసోంలో 26, చండీఘర్‌లో 18, హిమాచల్‌ప్రదేశ్‌లో 18, లడఖ్‌లో 14, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 10, చత్తీస్‌ఘడ్‌లో 10, గోవాలో 7, పుదుచ్చేరిలో 5, జార్ఖండ్‌లో 4, మణిపూర్‌లో 2, అరుణాచల్‌ప్రదేశ్‌, దాద్రా నగర్‌ హవేలీ, మిజోరాం, త్రిపురలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదు అయ్యాయి.