
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు, పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు సాయంగా పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా వ్యాపార, స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు సంబంధిత చెక్కును మంగళవారం ప్రగతి భవన్‌లో అందించారు.
జీఎంఆర్ గ్రూప్ రూ.కోటి విరాళం ప్రకటించింది. కరీంనగర్ గ్రానైట్ వ్యాపారులు రూ.75లక్షల నగదు, రూ.కోటి విలువ చేసే మందులు, మెడికల్ పరికరాలను విరాళంగా అందించారు. మార్వాడీ గ్రానైట్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్ రూ.25లక్షల విరాళం సీఎం సహాయనిధికి అందజేసింది.