దేశంలో 117కి చేరిన కరోనా మరణాలు

దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 254 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 4421కి చేరింది. అలాగే దేశంలో ఇప్పటివరకు కరోనా మరణాల సంఖ్య 117గా నమోదు అయ్యింది. 326 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్‌ అయ్యారు. ఈ మేరకు కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్తి కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. సాకేంతిక పరిజ్ఞానం ఉపయోగించి క్వారంటైన్‌లో ఉన్నవారిని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. 2500 రైల్వేకోచ్‌ల్లో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.