పాతబస్తీలో పర్యటించిన హెచ్‌ఆర్సీ చైర్‌పర్సన్

 పాతబస్తీలో లాక్ డౌన్ అమలవుతున్న తీరును తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల చైర్‌పర్సన్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులను పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. చార్మినార్ ప్రాంతంలో నమోదవుతున్న కేసుల వివరాలు ఎసిపిని అడిగారు. ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయని.. చార్మినార్ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది.. తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.