
భారతదేశంలోని టాప్ 25 ఐపిఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్) అధికారుల్లో తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి ఎంపికయ్యారు. ఫేమ్ ఇండియా, పిఎస్యు వాచ్, ఆసియా పోస్ట్ ల ఆధ్వర్యంలో ఐపిఎస్ 200 మంది అధికారుల పనితీరు పై సర్వే చేశారు. నేరాలను నియంత్రించే వారి సామర్థ్యం,నిజాయితీ,శాంతి భద్రతలను మెరుగుపరిచే సామర్థ్యం, ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ సర్వే నిర్వహించారు.