సి.సి.సికి 10 ల‌క్ష‌ల విరాళం అందించిన గ‌ల్లా ప‌ద్మావ‌తి

కరోనా వల్ల సినీ ప‌రిశ్ర‌మ‌లో  ఉపాధి కోల్పోయినవారికి సాయం చేసేందుకు టాలీవుడ్ సినీప‌రిశ్ర‌మ చిరంజీవి నేతృత్వంలో కరోనా క్రైసిస్ ఛారిటీ మ‌న‌కోసం ని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లువురు సినీ సెలబ్రిటీలు ఈ ఛారిటీకి భారీ విరాళాలు అందించారు. కొంద‌రు స్వ‌యంగా పేద‌ల వ‌ద్ద‌కి వెళ్లి నిత్యావ‌స‌ర స‌రుకులు అంద‌జేస్తున్నారు. తాజాగా అమ‌ర రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ , ప్రొడ్యూస‌ర్ ప‌ద్మావ‌తి గ‌ల్లా సి.సి.సికి రూ.10ల‌క్షల విరాళాన్నిఅందిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం తాను ఈ విరాళాన్ని అందిస్తున్న‌ట్టు పేర్కొన్నారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్   కుమారుడు  గ‌ల్లా అశోక్  హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.  నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ భిన్న త‌ర‌హా ఎంట‌ర్‌టైన‌ర్‌కు శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌కుడు. అమ‌ర‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, న‌రేష్‌, స‌త్యా, అర్చ‌నా సౌంద‌ర్య కీల‌క పాత్ర‌ధారులు. ఈ సినిమాకు సంబంధించి 50 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్రణ నేప‌థ్యంలో చిత్ర షూటింగ్‌కి తాత్కాలిక బ్రేక ప‌డింది.