
లాక్‌డౌన్ ఏప్రిల్ 14 తర్వాత కొనసాగుతుందా? ఇప్పుడు అందరి మనసుల్లో కదలాడుతున్న ప్రశ్న ఇదే. దీనిపై ఊహాగానాలు పెద్దఎత్తున సాగుతున్నాయి. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. కొన్ని ప్రాంతాల్లో లేదా కొన్ని సమయాల్లో లాక్‌డౌన్ అమలవుతుందా? లేక పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ ఇప్పటిలాగానే దేశవ్యాప్తంగా కొనసాగుతుందా? ఈ ప్రశ్నలకు బహుశ ఏప్రిల్ 11న సమాధానం లభించవచ్చు. ఎందుకంటే ఆరోజు ప్రధాని నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో మరోమారు టెలికాన్ఫరెన్స్ జరుపబోతున్నారు. ఏఎన్ఐ వార్తా సంస్థ ట్విట్టర్‌లో ఈ సంగతి వెల్లడించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా కట్టడికి లాక్‌డౌన్ కొనసాగించాల్సిన అవసరం గురించి ఇప్పటికే నొక్కిచెప్పారు.