
ప్రాణాంతక కొవిడ్-19 వ్యాప్తిని నివారించడం కోసం ఏపీ ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతున్నది. తాజాగా రాష్ట్రంలోని 58 ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకున్నది. ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్న ఆస్పత్రుల వివరాలు జిల్లాల వారీగా ఈ విధంగా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాలో 5, కృష్ణా జిల్లాలో 5, ప్రకాశం జిల్లాలో 4, నెల్లూరు జిల్లాలో 5, కర్నూలు జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో 5, కడప జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 4, గుంటూరు జిల్లాలో 4, తూర్పుగోదావరి జిల్లాలో 5, పశ్చిమగోదావరి జిల్లాలో 3, విజయనగరం జిల్లాలో 5, శ్రీకాకుళం జిల్లాలో 4 ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చాయి. ప్రైవేటు ఆస్పత్రుల సేవలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం ద్వారా మొత్తం 19,114 సాధారణ బెడ్లను, 1,286 ఐసీయూ బెడ్లను సిద్ధం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వీటితోపాటు 717 ఐసోలేషన్ బెడ్లు కూడా అందుబాటులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.