
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదార స్వభావాన్ని చాటారు. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు మంత్రి ముందుకొచ్చారు. తన సొంత ఖర్చులతో పది వేల కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరుకులను అందించాలని నిర్ణయించుకున్నారు మంత్రి. దీంతో ప్రతి నిరుపేద కుటుంబానికి 5 కిలోల బియ్యం, ఒక కిలో పప్పు, అర కిలో చింతపండు, కిలో నూనె సరఫరా చేయనున్నారు. పేదలకు పంపిణీ చేసే మంత్రి సబిత స్వయంగా పరిశీలించారు.