
లాక్డౌన్ సమయంలో నిత్యావసర సరుకులను అధిక ధరలకు అమ్మితే కఠినచర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ హెచ్చరించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనాను కట్టడి చేయడమే తమ లక్ష్యమని, కొవిడ్-19 వ్యాప్తిని నిరోధించేందుకు అన్నిరకాల చర్యలు చేపడుతున్నామ న్నారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లొచ్చినవారిలోనే ఎ క్కువ మంది కరోనా బాధితులున్నట్టు తెలిపారు. ఎక్కువ పాజిటివ్ కేసు లున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించి కంటైన్మెం ట్ జోన్లను ఏర్పాటుచేశామన్నారు. హైదరాబాద్ లో 12 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించామని తెలిపారు. జోన్లలోని ప్రజలెవ్వరూ ఇండ్ల నుంచి బయటకురావద్దని, ప్రభుత్వానికి, పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రతి కంటైన్మెంట్ జోన్‌కు ఒక డీసీపీని నోడల్ అధికారిగా నియమించినట్టు తెలిపారు.