దేశవ్యాప్తంగా 6,727కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 6727కి చేరుకున్నాయి. కరోనా వైరస్‌ బారిన పిడి ఇప్పటి వరకు 231 మంది మృత్యువాత పడ్డారు. వైరస్‌ బారి నుంచి 596 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 1,364 మందికి వైరస్‌ సోకింది. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 97 మంది మృతి చెందగా, 125 మంది చికిత్స అనంతరం డిశ్చార్‌ అయ్యారు. తమిళనాడులో 834 మంది వైరస్‌బారిన పడ్డారు. 8 మంది మృతి చెందారు. 

ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ బాధితుల సంఖ్య 720కి చేరుకుంది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు 426 మంది కాగా, 33 మంది మృత్యువాత పడ్డారు. రాజస్తాన్‌లో 463 మంది వైరస్‌ బారిన పడగా, ఏడుగురు మృతి చెందారు. ఉత్తరప్రదేవ్‌ రాష్ట్రంలో 410కి కేసుల సంఖ్య చేరుకుంది. చికిత్స అనంతరం 31 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కేరళలో 357కి కేసులు చేరుకున్నాయి. 97 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.