తెలంగాణ, ఏపీలో తక్కువైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

తెలంగాణ రాష్ట్రంలో మరో 18 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 471కి చేరుకుంది. కరోనా బారిన పడి 12 మంది మృత్యువాత పడ్డారు. 45 మంది కరోనా బాధితులు చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 414 మంది చికిత్స పొందుతున్నారు. మర్కజ్‌ వెళ్లిన వారికి అందరికీ వైరస్‌ నిర్ధారన పరీక్షలు ముగిశాయి. గత వారంలో రోజుల పరిస్థితికి ఇప్పటికి కాస్తా మెరుగుపడినట్లు అనిపిస్తుంది. ప్రతి రోజూ 40 నుంచి 50 పాజిటివ్‌ కేసులు వచ్చినవి ప్రస్తుతం 18 కేసులకు పడిపోయింది. 

ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 363కి చేరింది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం రాత్రి 8 వరకు 674 శాంపిళ్లు పరీక్షించగా 15 కేసులు పాజిటివ్‌గా వచ్చాయి. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 11 కొత్త కేసులు నమోదయ్యాయి.  గుంటూరు జిల్లాలో 2, తూర్పు గోదావరి, కడప జిల్లాలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి.