
చిత్తూరు జిల్లాలోని నగరికి చెందిన మున్సిపల్ కమిషనర్‌పై సస్పెన్షన్ వేటుపడింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిసింది. కరోనా సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయడం లేదని, పైగా అకౌంట్లను బ్లాక్ చేసిందని, కేవలం నగరి ఎమ్మెల్యే రోజా మాత్రమే తమకు సహకారం అందించారని నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి ఇటీవల ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకున్నది.