తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శ్రీవేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులతో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. వైకుంఠ వెలుపల కిలోమీటరు మేర భక్తులు బారులుతీరారు. స్వామివారి సర్వదర్శనానికి 16 గంటల సమయం, టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. శ్రీవారిని నిన్న 85,869 మంది భక్తులు దర్శించుకున్నారు. 42,510 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ.3.07 కోట్లుగా ఉంది.