
లాక్డౌన్ గడువు ముగింపు తేదీ సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోడీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఏప్రిల్ 14న లాక్డౌన్ ఎత్తివేసే విషయంపై కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. శనివారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం తన నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకోవడమే కాకుండా ఆయా రాష్ట్రాల్లో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను ప్రధాని అడిగి తెలుసుకోనున్నారు. కరో నా విజృంభిస్తున్న క్రమంలో మార్చి 24న విధించిన లాక్డౌన్ ఎత్తివేయడం సాధ్యం కాదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు సామాజిక అత్యవసర స్థితిని తలపిస్తున్న తరుణంలో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని వ్యాఖ్యానించారు.