
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భద్రాచలం సీతారామ చంద్రస్వామి ఆలయంలో ఈనెల 27 నుంచి జనవరి 16 వరకు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆలయ ఈవో, వేదపండితులు, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ఆహ్వానించారు. మంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం మంత్రి వైకుంఠ ఏకాదశి పోస్టర్లను ఆవిష్కరించారు.భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నర్సింలు, వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.