
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవ లం 24గంటల వ్యవధిలో మరో 24 మంది కరోనా పాజిటివ్ భారిన పడ్డారు. ఈక్రమంలో శనివారం సాయంత్రం 5 గంటల వరకూ ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 24 కరోనా పాజి టివ్ కేసులు నమోదు కావడంతో అటు వైద్య, ఇటు పోలీసు వర్గాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం, మొత్తం కేసులు 405కు చేరాయని పేర్కొంది. రాష్ట్రంలో శుక్రవారం నాడు రాత్రి 9 నుంచి శనివారం రాత్రి 9 గంటల వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో గుంటూరులో 17, కర్నూలులో 5, ప్రకాశం మరియు కడప జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదైంది.
కొత్తగా నమోదైన 24 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 405 కి పెరిగింది అని వైద్య ఆరోగ్య శాఖ నిర్వహణలోని ఆరోగ్యాంధ్ర ట్విట్టర్ ఖాతా వెల్లడించింది. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ సోకి ఆపై వైరస్ తగ్గి రికవరీ అయిన వారి సంఖ్య 11కు చేరిందని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోందని, గంటగంటకూ ఒక్కో పాజిటివ్ కేసు బయటపడుతూనే ఉంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 405 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వారిలో ఆరుగురు మరణించారని, 388 మంది చికిత్స పొందుతున్నారని, 11 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు.