ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 420కి చేరింది. కొత్తగా 15 మందికి కరోనా మహమ్మారి సోకింది. గుంటూరులో 7, నెల్లూరు 4, కర్నూలు 2, చిత్తూరు, కడపలో ఒక్కో కొత్త కేసు నమోదైంది. గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. ఇప్పటి వరకు ఏపీలో ఏడుగురు కరోనా బారినపడి చనిపోగా..12 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 401 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 84 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత గుంటూరు(82), నెల్లూరు(52) ఎక్కువగా కరోనా బాధితులున్నారు.