
బత్తాయి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నల్లగొండలో మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి బత్తాయి, ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. బత్తాయిని ఢిల్లీ, ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బత్తాయి ఉత్పత్తి బాగుందనీ, ప్రధాని మోదీ సహకారంతో ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేసేలా సీఎం కేసీఆర్ గూడ్స్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ భారతదేశపు ధాన్యాగారంగా మారిందని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతరం నల్లగొండ, చిట్యాలలోని బత్తాయి తోటలను మంత్రులు పరిశీలించారు.