మొక్క‌ల‌తో టైం పాస్ చేస్తున్న బాలీవుడ్ హీరో

లాక్‌డౌన్ వ‌ల‌న షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. దీంతో సినిమా సెల‌బ్రిటీలంద‌రు ఇళ్ళ‌కి ప‌రిమిత‌మ‌య్యారు. మ‌రి కొంద‌రు ఫాం హౌజ్‌ల‌లో మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ప్ర‌స్తుతం స‌ల్మాన్ ప‌న్వెల్ ఫాం హౌజ్‌లో మొక్క‌ల నాట‌డం, గుర్ర‌పు స్వారీలు చేయ‌డం వంటివి చేస్తున్నాడు. వీటికి సంబంధించిన వీడియోల‌ని ఎప్ప‌టికప్పుడు త‌న సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నాడు.
ఇక బాలీవుడ్ న‌టుడు జాకీష్రాఫ్ రైతు అవ‌తారం ఎత్తి త‌న ఫాం హౌజ్‌లో మొక్క‌ల‌తో టైం పాస్ చేస్తున్నాడట‌. ఈ విష‌యాన్ని అత‌ని భార్య ఐశా తెలియజేసింది. లాక్‌డౌన్ ప్ర‌క‌టించే స‌మ‌యానికి జాకీష్రాఫ్ త‌న ఫార్మ్‌హౌజ్‌లో ఉండిపోయాడు. ఒక్క‌డే ఉంటున్నందుకు ఏమాత్రం బోర్ ఫీల్ అవ‌ట్లేద‌ని , పొలంలోని మొక్క‌లే అత‌నికి మంచి కంపెనీ ఇస్తున్నాయ‌ని చెప్పుకొచ్చింది ఐషా. ప్రకృతి పైర గాలుల‌ను ఆనందంగా ఆస్వాదిస్తున్నాడ‌ని పేర్కొంది. మొద‌టి నుండి మొక్క‌లంటే చాలా ఇష్ట‌ప‌డే జాకీ అత‌ని 25వ వివాహ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా కొంత భూమిని కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే.