ధ‌ర‌లు పెంచి అమ్మితే క‌ఠిన చ‌ర్య‌లు: ఏపీ సీఎం

రాష్ట్రంలో నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌ల‌పై స‌రైన ప‌ర్య‌వేక్ష‌ణ ఉండాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. ప్ర‌తి దుకాణం ద‌గ్గ‌ర ధ‌ర‌ల బోర్డు ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న ఆదేశించారు. ఎవ‌రైనా ధ‌ర‌లు పెంచి అమ్మితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. అరటి సహా వివిధ రకాల పంటలను మార్కెట్లకు పంపేందుకు అధికారులు త‌గిన ఏర్పాట్లు చేయాల‌న్నారు.   ఎక్కడెక్కడ మార్కెటింగ్‌కు అవకాశముందో మ్యాపింగ్‌ చేయాలని సూచించారు. 

రాష్ట్రంలో వ్యవసాయరంగ పరిస్థితులపై సీఎం త‌న‌ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అసోం, పశ్చిమబెంగాల్‌, బీహార్‌, యూపీ మార్కెట్లపై కేంద్రప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరపాలని ఈ సంద‌ర్భంగా సీఎం ఆదేశించారు. అమెరికాతోపాటు యూరప్‌ దేశాలకు రొయ్యల ఎగుమతికి తగిన ప్రయత్నాలు చేయాలన్నారు. అదేవిధంగా అన్ని ర‌కాల దుకాణాల ద‌గ్గ‌ర ప్ర‌జ‌లు సామాజిక దూరం పాటించేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం జ‌గ‌న్ సూచించారు.