
ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 19 లక్షల 23 వేలకు చేరుకున్నాయి. కరోనా వైరస్ బారిన పడి 1 లక్ష 19వేల 587 మంది మృత్యువాత పడ్డారు. వైరస్ బారి నుంచి 4 లక్షల 43 వేల మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అమెరికాలో 5.86 లక్షలకు పైగా కరోనా బారిన పడగా, 23,610 మంది మరణించారు. స్పెయిల్‌లో కేసుల సంఖ్య 1.70కు చేరుకోగా, 17,756 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఇటలీలో 1.59 లక్షల మంది కరోనా పాజిటివ్ రాగా, 20,465 మంది మరణించారు. ఫ్రాన్స్‌లో 1.36 మందికి కోవిడ్ 19 పాజిటివ్ రాగా, 14,967 మంది మృత్యువాత పడ్డారు.