ఈనెల 30 వరకు ఆర్టీసీ బస్సులు బంద్‌

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగించిన నేపథ్యంలో అప్పటివరకు ఆర్టీసీ బస్సు సర్వీసుల  నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ తెలిపారు. తదుపరి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి సేవల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకొంటామని పేర్కొన్నారు.