
తెలంగాణ రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.308 కోట్లు విడుదల చేసింది. కేంద్ర ఆర్థికసంఘం నుంచి నిధులు రాకపోయినప్పటికీ.. గ్రామాల్లో కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలు, పారిశుద్ధ్య పనులు నిలిచిపోకుండా పూర్తి నిధులను రాష్ట్రప్రభుత్వమే తనఖాతా నుంచి కేటాయించింది. జనాభాతో నిమిత్తం లేకుండా కనిష్ఠంగా రూ.3 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.7 లక్షల వరకు మొత్తం 12,751 గ్రామ పంచాయతీలకు .. రూ.308 కోట్లు విడుదల చేసింది. వాస్తవానికి కేంద్ర ఆర్థికసంఘం నిధులకు రాష్ట్రప్రభుత్వ వాటా కలిపి ప్రతినెలా రూ.308 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కేంద్ర ఆర్థికసంఘం జూన్ వరకు నిధులొచ్చే అవకాశం లేకపోవడంతో మొత్తం సొమ్మును రాష్ట్ర ప్రభుత్వమే విడుదల చేసింది.
ఒక్కొక్కరికి రూ.113: ఆర్థికసంఘం నిధులను వాస్తవంగా జనాభా ఆధారంగా కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుత తలసరి ఆదాయం, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్కరికి రూ.113.61 చొప్పున కేటాయిస్తున్నారు. గ్రామ అవసరాలు, ఇతర నిబంధనలను కూడా పరిగణనలోకి తీసుకుని నిధులు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం స్పష్టంచేసింది