ఏపీలో 525కి చేరిన క‌రోనా కేసుల సంఖ్య‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. ఇప్ప‌టికే ఏపీలో క‌రోనా పాజిటివ్ బాధితుల సంఖ్య  525కి చేరుకుంది. ఎక్కువ‌గా గుంటూరు జిల్లాలో 122 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. కాగా 14 మంది క‌రోనాతో మ‌ర‌ణించ‌గా…20మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.  దేశ‌వ్యాప్తంగా అంత‌కంత‌కూ క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్ప‌టికే 12వేలు దాటింది. ఎక్కువ‌గా మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసులు మూడు వేల‌కు చేరువ‌య్యాయి.