ఆరుగురు ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతులు

తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతులు లభించాయి. 2006 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారులకు డీఐజీ(డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌)లుగా పదోన్నతి లభించింది. డీఐజీలుగా పదోన్నతి పొందిన వారిలో కార్తికేయ, రమేశ్‌ నాయుడు, సత్యనారాయణ, సుమతి, శ్రీనివాసులు, వెంకటేశ్వరరావు ఉన్నారు. 

  • సీఐడీ డీఐజీగా సుమతికి పదోన్నతి
  • సీఐడీ డీఐజీగా శ్రీనివాసులకు పదోన్నతి
  • సైబరాబాద్‌ సంయుక్త సీపీగా వెంకటేశ్వరరావు
  • మాదాపూర్‌ డీసీపీగా వెంకటేశ్వరరావుకు అదనపు బాధ్యతలు
  • డీఐజీ స్థాయిలో నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌గా కార్తికేయ
  • డీఐజీ స్థాయిలో పోలీసు అకాడమీ ఉపసంచాలకులుగా రమేశ్‌ నాయుడు
  • డీఐజీ స్థాయిలో రామగుండం పోలీసు కమిషనర్‌గా సత్యనారాయణ