ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్ల‌కు మ‌రో శుభ‌వార్త‌

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన‌ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు మ‌రో శుభవార్త తెలియ‌జేసింది. గ‌త నెల‌లో మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్‌పై చార్జీల‌ను ఎత్తేసిన ఎస్‌బీఐ.. తాజాగా క‌స్ట‌మ‌ర్ల‌కు మేలు చేసే మ‌రో నిర్ణ‌యం తీసుకుంది. ఏటీఎం విత్‌డ్రాయ‌ల్స్‌పై స‌ర్వీస్ చార్జీల‌ను ఎత్తివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో ఎస్బీఐ ఏటీఎం కార్డుల‌తో ఎన్నిసార్ల‌యినా న‌గ‌దు విత్‌డ్రా చేసుకునే అవ‌కాశం ల‌భించింది. 

అంతేకాదు, ఎస్‌బీఐ ఏటీఎంలే కాకుండా ఇత‌ర‌ బ్యాంకుల ఏటీఎంల నుంచి కూడా ఎస్‌బీఐ ఏటీఎం కార్డుల‌తో ఎన్నిసార్ల‌యినా క్యాష్ విత్‌డ్రా చేసుకోవ‌చ్చ‌ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ప‌ష్టంచేసింది. కరోనా వైరస్ విస్తరణ, లాక్‌డౌన్ నేప‌థ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అయితే ఈ వెసులుబాటు జూన్ 30 వ‌ర‌కే వ‌ర్తిస్తుంద‌ని ఎస్‌బీఐ తెలిపింది.