
భారత్‌లో కరోనా వైరస్‌తో ఇప్పటి వరకు 414 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,380కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. నిన్న ఒక్కరోజే 941 కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. మొత్తంగా ఈ వైరస్ నుంచి 1489 మంది కోలుకున్నారని ఆయన స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా 325 జిల్లాల్లో కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు.
అయితే 17 రాష్ర్టాల్లోని 27 జిల్లాల్లో గత 14 రోజుల నుంచి ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదన్నారు. దేశ వ్యాప్తంగా 2,90,401 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థతో నిన్న జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ పాల్గొన్నట్లు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై చర్చించామని చెప్పారు. వలస కూలీలకు ఆహారం, నిత్యావసరాలు సమకూరుస్తున్నట్లు తెలిపారు. అత్యవసరాల కొరత లేకుండా చూస్తున్నామని స్పష్టం చేశారు. లాక్డౌన్లో పని చేసే సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.