
ఢిల్లీ లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇద్దరు కానిస్టేబుళ్లతో సన్నిహితంగా ఉన్న పీఎస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ సహా 26 మందిని క్వారంటైన్ చేశామని ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలియజేశారు.
ఢిల్లీలో ఇప్పటివరకు మొత్తం 1640 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 38 మంది చనిపోయారు. మరోవైపు ఢిల్లీలో లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించిన వారిపై 199 కేసులు నమోదు చేశారు