మ‌హిళా డాక్ట‌ర్ కు పాజిటీవ్

గుంటూరు జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. మ‌హిళా డాక్ట‌ర్ కు పాజిటీవ్ రాగా … మ‌రో 50 మంది వైద్య సిబ్బంది రిజ‌ల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.  ఇప్ప‌టి వ‌ర‌కు 126 మందికి పై గా ఈ వ్యాధి సోకింది..తాజాగా కరోనా బాధితులకు ట్రీట్ మెంట్ చేస్తున్న మ‌హిళా డాక్టర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది . దీంతో జిల్లాలో కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న 12 మంది డాక్టర్లను ముందు జాగ్రత్త చర్యగా అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. అలాగే ప్రభుత్వ ఫీవర్ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న 54 మంది డాక్టర్లు, సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో నలుగురి రిపోర్ట్‌ రాగా, అందులో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో 50 మంది కరోనా పరీక్షల రిపోర్టులు రావాల్సి ఉంది. దీంతో నగరంలోని ఓ ప్రైవేటు లాడ్జీని క్వారంటైన్‌ కేంద్రంగా మార్చిన అధికారులు.. డాక్టర్లు, వైద్య సిబ్బందిని అక్కడికి తరలించారు. కాగా, , గుంటూరు జిల్లాలోని ఫీవర్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ బ్రాడీపేటలోని వర్కింగ్ లేడీస్ హాస్టల్‌లో ఉంటున్నారు. ఆమెకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో డాక్టర్ ఉంటున్న హాస్టల్‌లో ఉన్న మొత్తం 35 మందిని మహిళలను క్వారంటైన్‌కు తరలించారు. జిల్లాలో ఇప్పటివరకు ఒక మెడికో సహా ఇద్దరు ఆర్‌ఎంపీ లకు కరోనా సోకినట్టుగా అధికారులు చెప్పారు. దీంతో ఇద్దరు ఆర్‌ఎంపీల దగ్గర వైద్యం చేయించుకున్న దాదాపు 190 మందిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. మరోవైపు గుంటూరు జిల్లాలో 126 కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది.