
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 31 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. కృష్ణా జిల్లాలో 18, కర్నూల్లో 5, నెల్లూరులో 3, తూర్పుగోదావరిలో 2, ప్రకాశంలో 2, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కేసు చొప్పున నమోదు అయ్యాయి. ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 603కు చేరింది. ఇప్పటి వరకు 15 మంది మృతి చెందగా, కరోనా నుంచి కోలుకుని 42 మంది డిశ్చార్జి అయ్యారు.