ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15, 707కు చేరుకున్నది. మరణాల సంఖ్య 507కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 1329 కొత్త కేసులు నమోదు అయినట్లు అధికారులు చెప్పారు. భారత్‌లో మరణాల రేటు 3.3 శాతంగా ఉన్నట్లు నిన్న సాయంత్రం లవ్ అగర్వాల్ తెలిపిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి ఎక్కువగా వృద్దులపైనే ప్రభావాన్ని చూపుతుంది. ఇప్పటి వరకు మరణించిన వారిలో వయసు పైబడినవారే అత్యధికంగా ఉంటున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా మృతుల్లో 42 శాతం.. 75 ఏళ్లు పైబడిన వాళ్లేనని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.