
జార్ఖండ్‌లో జార్ఖండ్‌లో జేఎంఎం కూటమి స్పష్టమైన ఆధిక్యంతో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 81 స్థానాలకుగాను, ప్రభుత్వ ఏర్పాటకు కావాల్సిన (41) గాను 47 సీట్లు సాధించింది. బీజేపీ పార్టీ 25 స్థానాలను గెలుచుకుంది. అలాగే జేవీఎం 3, ఏజేఎస్‌యూ 2, ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘబర్‌దాస్‌తోపాటు ఆరుగురు మంత్రులు మరియు స్పీకర్ ఓడిపోయారు. జేఎంఎం సీఎం అభ్యర్థి హేమంత్ సోరెన్ పోటీ చేసిన రెండు స్థానాల్లో గెలుపొందారు. దీంతో జార్ఖండ్ లో జేఎంఎం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది.