ఏపీలో మరో 44 కరోనా పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో ఆదివారం నాటికి కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 647కి చేరింది. గత 24 గంటల్లో  కొత్తగా 44 కేసులు నమోదయ్యాయి. ఇందులో కర్నూలు జిల్లాలో 26, కృష్ణాలో 6, తూర్పు గోదావరిలో 5, అనంతపురంలో 3, గుంటూరులో 3, విశాఖపట్నంలో ఒక కేసు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర నోడల్‌ అధికారి ఆదివారం విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 647కు చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందగా, చికిత్స అనంతరం కోలుకుని మొత్తం 65 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 565 మంది చికిత్స పొందుతున్నారు.  

► రాష్ట్రంలో 24 గంటల్లో 23 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్‌ అయ్యారు. పశ్చిమ గోదావరిలో 9, వైఎస్సార్‌లో 6, చిత్తూరులో 3, విశాఖలో3, తూర్పు గోదావరిలో 2 చొప్పున డిశ్చార్జ్‌ అయ్యారు.
► కర్నూలు జిల్లాలో కోవిడ్‌తో ఒకరు మరణించారు. దీంతో మరణించిన వారి సంఖ్య ఆదివారం నాటికి 17కి చేరింది.