పాఠశాలలు ఫీజులు పెంచవద్దని తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలు ఫీజులు పెంచవద్దని ప్రభుత్వం జీవో నెం.46 విడుదల చేసింది. నెలవారి ట్యూషన్‌ ఫీజు మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. జీవో 46ను ఉల్లంఘిస్తే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సహా అన్ని పాఠశాలలకు, ప్రైవేటు బడులకు జీవో వర్తిస్తుందని పేర్కొంది. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న వేల ఫీజులు పెంచకపోవడం సామాన్యులకు కాస్తా ఉపసమనం కలుగనుంది.