సూర్యాపేట మున్సిపాలిటీకి స్పెషల్‌ ఓఎస్డీ…

 కోవిడ్‌ 19 తీవ్రత నేపథ్యంలో సూర్యపేట మున్సిపాలిటీకి ప్రత్యేకంగా స్పెషల్‌ ఆఫీసర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ ఆదేశాల మేరకు సూర్యాపేటకు ఓఎస్డీని నియమించారు. ప్రస్తుత మున్సిపల్‌ పరిపాలన శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జి.వేణుగోపాల్‌రెడ్డిని ఆఫీసర్‌ ఆఫ్‌ స్పెషన్‌ డ్యూటీగా నియమిస్తూ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వేణుగోపాల్‌రెడ్డి హుటాహుటిన సూర్యాపేట బయలుదేరారు. గతంలో ఖమ్మం, కరీంనగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా ఆయన పనిచేశారు.